బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు : వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుతున్న బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులకు సూచించారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం, గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన బేబీ బచావో–బేటి పడావో కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి హాజరయ్యారు. బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ చదువులో రాణించాల న్నారు. 

జిల్లాలోని అన్ని ఆశ్రమ, గురుకుల బాలికల స్కూళ్లలో విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతపై హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మొదటి విడతగా జిల్లాలో 12 స్కూళ్లలో చేపట్టినట్లు తెలిపారు.

బేటీ బచావో బేటీ పడావోపై, అవగాహన పెంచుకోవాలి

నిర్మల్, వెలుగు : నిర్మల్​లోని సోఫినగర్ కేజీబీవీలో విద్యార్థులకు బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల హక్కులు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిం చారు. భేటీ బచావో భేటీ పడావో కార్యక్ర మంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వివిధ హెల్ప్ లైన్ నెంబర్లు 100, 1098,181, 1930, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీసీపీవో మురళి, జీసీడీవో సలోమి కరుణ, కేజీబీవీ ఎస్​వో సుజాత, మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.