జైనూర్, వెలుగు: వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేయవచ్చని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. జైనూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో పని చేయడానికి డాక్టర్లు ముందుకు రావడం లేదని, వారికి అధిక జీతాలు ఇచ్చి నియమించాలని కలెక్టర్ కు ఆదివాసీ నాయకులు విన్నవించారు.
త్వరలోనే డాక్టర్లను నియమిస్తామని కలెక్టర్ హామీచ్చారు. ప్రత్యేక నిధులు కేటాయించి జైనూర్ లో పనిచేసే డాక్టర్లకు అధిక జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మూడు మండలాలకు ఆధారమైన జైనూర్ హాస్పిటల్ లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.