సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్ , వెలుగు: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే  అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని కుటోద గ్రామంలోని భీమయ్యక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద రూ. 2.5 లక్షలతో ఏర్పాటుచేసిన నీటి సరఫరా విద్యుత్ మోటార్ ను ప్రారంభించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.  కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు సిడం శంకర్, తిరుపతి ,జంగు , పావుగ, భీము, రాము, సోము, జైతు తదితరులు పాల్గొన్నారు.