
కాగజ్ నగర్, వెలుగు: హాస్టల్‌లో చదువుకునే అవకాశం జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగుల్చుతుందని ప్రతి స్టూడెంట్ కష్టపడి చదవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం రాత్రి హాస్టల్ నిద్రలో భాగంగా, కౌటాల మండలం మొగఢ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
‘స్టడీ ఎలా సాగుతోంది?’, భోధన వివరాలు, ప్రిపరేషన్ పై స్వయంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పట్టుదలే ఎదుగుదలకు ప్రధాన ఆయుధం అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, ఐటీడీఏ డీడీ రమాదేవి, ఏపీడీ రామకృష్ణ, ఏటీడీ ఓ ఖమార్ హుస్సేన్, తహసీల్దార్ పుష్ప లత, ఎంపీడీవో ప్రసాద్, హెచ్ ఎం అశోక్ కుమార్, ఎస్ సీ ఆర్ పీ పోచాని తదితరులు పాల్గొన్నారు.