కోడ్‌‌‌‌ అమలుకు సహకరించండి: వెంకట్‌‌‌‌రావు

సూర్యాపేట, వెలుగు:  ఎన్నికల కోడ్‌‌‌‌ అమలుకు లీడర్లు సహకరించాలని కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు కోరారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్‌‌‌‌ పెట్టి మాట్లాడారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1201 పోలింగ్‌‌‌‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 40 శాతం అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.  అభ్యర్థులు నామినేషన్లకు 5 రోజులు ముందే ఫామ్‌‌‌‌12డి ద్వారా ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనంతరం ఎస్పీ రాంజేంద్ర ప్రసాద్‌‌‌‌ మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చెక్‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేశామని, పార్టీల గుర్తులతో వస్తువులు దొరికితే సిజ్‌‌‌‌ చేస్తామని హెచ్చరించారు.  అత్యవసర సమయాల్లో నగదు తీసుకెళ్లే వారు ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం  కలెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన చెక్‌‌‌‌ యువర్‌‌‌‌ ఓటు కేంద్రాన్ని  పరిశీలించారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు చకిలం రాజేశ్వర్‌‌‌‌రావు,  సవరాల సత్యనారాయణ, ఆబిద్,  కోట గోపి  ఎన్నికల సిబ్బంది  పాల్గొన్నారు.