సూర్యాపేట, వెలుగు: బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులపై నిఘా పెట్టాలని కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ రాహుల్ హెగ్డెతో కలిసి జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీల పరిశీలన కోసం ఎస్‌బీఐ, కెనరా, యూనియన్, ఏపీజీవీబీల బ్యాంకులకు సంబంధించిన సిబ్బందితో కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయినా, ఇతర ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసినా వారి వివరాలు తమకు ఇవ్వాలని ఎల్‌డీఎం బాపూజీని ఆదేశించారు. ఇన్‌కం టాక్స్ అధికారులు అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో ఏడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులు 24 గంటలు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రయాంక, వెంకట్‌రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగభూషణం, మార్కెటింగ్ డీఎం శర్మ, సివిల్ సప్లై డీఎం రంపతి, డీసీవో శ్రీధర్, సీటీవో యాదగిరి, ఎక్సైజ్ సీఐ, ఎల్‌డీఎం బాపూజీ , ఎంసీఎంసీ నోడల్ అధికారి డీఎఫ్వో సతీష్ కుమార్ పాల్గొన్నారు.