సాగులో టెక్నాలజీని వాడాలి : కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు

సూర్యాపేట, వెలుగు :  రైతులు పంటల సాగులో టెక్నాలజీని వాడి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు సూచించారు. అగ్రికల్చర్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఫండ్  పథకం కింద జాజిరెడ్డి గూడెం ఎస్‌‌‌‌బీఐ బ్రాంచ్ సహకారంతో అర్వపల్లి మండలం కొమ్మలకు చెందిన కుంటి గోర్ల నాగరాజు కొనుగోలు చేసిన అగ్రి డ్రోన్‌‌‌‌ను మంగళవారం ఎల్‌‌‌‌డీఎం బాపూజీతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ..   అగ్రి డ్రోన్‌‌‌‌తో కూలీ ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు.   ఈ కార్యక్రమంలో ఎస్‌‌‌‌బీఐ రీజినల్ మేనేజర్ కే జ్యోతి,  వై నరసింహారావు,  బ్యాంక్ మేనేజర్ వి అనిల్  పాల్గొన్నారు.

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌రావు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు జనరల్‌‌‌‌అబ్జర్వర్ల ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుందని, ప్రతి పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌కు ఒక ఒకరిని నియమిస్తామని తెలిపారు. డ్యూటీ సమయంలో  గుర్తింపు కార్డులు ధరించి ఉండాలని, పోలింగ్‌‌‌‌ముందు రోజే కేంద్రాలకు చేరుకొని ఈవీఎంలు అమర్చే విధానం, మాక్‌‌‌‌ పోలింగ్‌‌‌‌,   ఎజెంట్ల నియామకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలని సూచించారు.  

పోలింగ్‌‌‌‌ అధికారుల పని విధానాన్ని అబ్జర్వ్‌‌‌‌ చేయాలని,  ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయా..? లేవా..? గమనించాలని చెప్పారు.  ప్రతి రెండు గంటలకు ఒక్కసారి ఓటింగ్‌‌‌‌ శాతాన్ని తెలుసుకోవాలని ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు  పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ప్రజెంటేషన్‌‌‌‌ అవగాహన కల్పించారు.  ట్రైనింగ్‌‌‌‌ నోడల్‌‌‌‌ ఆఫీసర్ శ్రీధర్‌‌‌‌రెడ్డి, ఎల్‌‌‌‌డీఎం బాపూజీ,  మాస్టర్‌‌‌‌ ట్రైనర్స్‌‌‌‌ రమేశ్,  వెంకటేశ్వర్లు,  శ్రీనివాస్  పాల్గొన్నారు.