ఆసిఫాబాద్: హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని, లేదంటే ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వేణుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేశారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలతోపాటు ఈసీ,104, అర్బన్ ఏఎన్ఎంలను ఎలాంటి షరతుల్లేకుండా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రూ.25 లక్షల ప్రభుత్వ బీమా, ఉద్యోగి మరణిస్తే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, కార్యదర్శి మధుకర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.సంతోషి పాల్గొన్నారు.