గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ విజయేందిర

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి : కలెక్టర్ విజయేందిర

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర అధికారులకు  సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో  హన్వాడ, గండేడ్, సీసీ కుంట, మూసా పేట, కోయిల్ కొండ, నవాబ్ పేట,  కౌకుంట్ల , మహ్మదాబాద్ మండలాలకు సంబంధించి  గ్రామ పంచాయతీ ఎన్నికలకు నియమించిన  ఎన్నికల రిటర్నంగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.  ఈ నెల 15వ తేది లోగా మండల స్థాయి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీపీఅర్ పార్థసారథి, సీఎంవో బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.