పిల్లలందరికీ నులి పురుగుల మాత్రలు వేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి

పిల్లలందరికీ నులి పురుగుల మాత్రలు వేయాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు ఉన్న పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. ఈ నెల10న జాతీయ నులి  పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలందరికీ అల్బెండజోల్​ మాత్రలు ఇచ్చి నులిపురుగులను నిర్మూలించాలని సూచించారు. నులి పురుగులతో పిల్లల్లో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. వైద్య, ఐసీడీఎస్, శిశు సంక్షేమ, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ట్రైబల్  వెల్ఫేర్  శాఖల అధికారులు, సిబ్బంది  ఈ ప్రోగ్రామ్​లో భాగస్వాములు కావాలని సూచించారు. 

వనపర్తి: వనపర్తి కలెక్టరేట్​లో కలెక్టర్  ఆదర్శ్  సురభి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నులిపురుగుల మాత్రల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్లలో అల్బెండజోల్  మాత్రలు పంపిణీ చేయాలని, ఈ నెల10న అటెండెన్స్  సమయంలో విద్యార్థులకు మాత్రలు తినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నారాయణపేట: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. కలెక్టరేట్​లో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు. అల్బెండజోల్  మాత్రల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. డీఎంహెచ్​వో సౌభాగ్యలక్ష్మి, డాక్టర్లు శైలజ, జై చంద్రమోహన్, రాఘవేందర్, మల్లికార్జున్, ఐఎంఏ ప్రెసిడెంట్  గోవిందరాజు, అంజయ్య, జయ పాల్గొన్నారు.