మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణంలోని మౌలాలి గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఇండ్ల నాణ్యత, అక్కడ వసతులు, ఏర్పాట్లపై ఆరా తీశారు. జీ ప్లస్ 28 బ్లాకులతో 672 ఇండ్లను నిర్మించినట్లు హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్ కలెక్టర్ కు వివరించారు. వీటిలో మొదటి దశలో నిర్మించిన 588 ఇండ్లకు లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేశామని, వారికి ఇంకా ఇండ్లను అప్పగించలేదని తెలిపారు.
కాలనీలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటి సౌలతులు కల్పించేందుకు రూ.7,85, 27,000 అవసరం అవుతాయని ప్రపోజల్స్ తయారు చేసినట్లు కలెక్టర్ కు వివరించారు. హౌసింగ్ ఏఈ విజయ్ కుమార్, వర్క్ ఇన్స్ పెక్టర్ అలీమ్ ఉన్నారు.