మహబూబ్ నగర్ కలెక్టరేట్/గద్వాల, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పాలమూరు, గద్వాల కలెక్టర్లు విజయేందిర బోయి, సంతోష్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుడి వరకు ఫలాలు అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. సామాజిక సర్వే ఆధారంగా తయారు చేసిన లిస్ట్ ఫైనల్ కాదని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా, అర్హులైన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేస్తామని తెలిపారు