మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ధరణి పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం తహసీల్దార్లతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 29 నుంచి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారని, ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సీసీఎల్ఏ నుంచి ప్రతి రోజు మానిటర్ చేస్తున్న దృష్ట్యా దరఖాస్తులను పరిశీలించి అప్ లోడ్ చేయాలని సూచించారు. ఇసుక పెనాల్టీలు, మీ సేవ పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఎస్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
ALSO Read : రిజర్వేషన్లు తీసేస్తరని తప్పుడు ప్రచారం చేసిన్రు : ఎంపీ డీకే అరుణ
వనపర్తి: ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వనపర్తి ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. గురువారం వనపర్తి కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్లు, ఆర్డీవోతో ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకోవద్దని, ఇలాంటివి తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో పలువురు అధికారులు వరుసగా ఏసీబీకి పట్టుబడడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. జిల్లాలో ఏ అధికారి లంచాన్ని ఆశించవద్దని సూచించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.