మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో సూర్యాపేట వరద బాధితులకు సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సూర్యాపేటలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ అజయ్ మిశ్రా, జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ సహకారంతో మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూ. 4 లక్షల విలువైన సామగ్రి పంపిస్తున్నట్లు వివరించారు.
ఈ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. స్టేట్ ఎంసీ మెంబర్ రమణయ్య, రెడ్ క్రాస్ కోశాధికారి జగపతిరావు, ఎంసీ మెంబర్ బబుల్ రెడ్డి, రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహ, ఎన్టీఆర్ ఉమెన్ కాలేజ్, ఎంవీఎస్ కాలేజ్, రెడ్ క్రాస్ సిబ్బంది ఆంజనేయ గౌడ్,రవి, వెంకటేశ్ పాల్గొన్నారు.
లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్పీడప్ చేయండి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: లే అవుట్ల రెగ్యులరైజేషన్ పథకం కింద వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా స్పీడప్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎంపీడీవోలు, ఎంపిఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేసిన అన్ని ధ్రువపత్రాలు సరిగా ఉన్నట్లయితే ఆ లే అవుట్లు రెగ్యులరైజేషన్ చేయాలని సూచించారు.