ఇంట్లో వ్యర్థాల నుంచి అలంకరణ వస్తువులు తయారు : కలెక్టర్ విజయేందిర బోయి

ఇంట్లో వ్యర్థాల నుంచి అలంకరణ వస్తువులు తయారు : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఇంట్లో వ్యర్థాలతో అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో డీఆర్డీవో, పంచాయతీరాజ్, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేస్ట్ టూ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించారు.

ఈ ఎగ్జిబిషన్ లో వేస్టేజ్ ద్వారా తయారు చేసి ప్రదర్శించిన వివిధ రకాల అలంకరణ వస్తువులను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఎంతో సృజనాత్మకంగా తయారు చేశారని నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం పిల్లలు, మునిపల్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు డీఆర్డీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో నర్సింహులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.