సీజనల్  వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్  విజయేంద్ర బోయి

సీజనల్  వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్  విజయేంద్ర బోయి

గండీడ్, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్  విజయేంద్ర బోయి సూచించారు. గండీడ్  మండలం కొండాపూర్  గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో గురువారం గ్రామాన్ని సందర్శించారు. డాక్టర్,  కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్  వ్యాధులు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పగిడియాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను విజిట్​ చేసి టీచర్లు, స్టూడెంట్లతో మాట్లాడారు.

గ్రామంలోని పల్లె దవఖానను విజిట్ చేసి వసతులపై ఆరా తీశారు. అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించి గుడ్లు, పాలు, పౌష్టికాహారం వస్తున్నాయా? అని టీచర్​ను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు ఉండకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఎంపీడీవో దేవన్న, స్పెషల్  ఆఫీసర్  ఛత్రు నాయక్, వైద్యాధికారి చంద్రశేఖర్  ఉన్నారు.