ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

నల్లగొండ జిల్లాలోని హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఓపితో పాటు ప్రసవాల డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. మందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ఎస్. సురేందర్ సస్పెన్షన్ చేశారు. నిరంతరం  ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో  మాట్లాడి ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు.