పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులు కల్పించాలి : కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్ సురభితో కలిసి ఖమ్మం అర్బన్ మండలం బల్లెపల్లి, బాలాజీనగర్, ఖానాపురంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓట ర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన టెన్త్ ఎగ్జామ్ సెంటర్ను పరిశీలించారు. శ్రీ శ్రీ సర్కిల్ వద్ద 504 సర్వే నంబర్ లోని 3.10 ఎకరాల ఆంజనేయ స్వామి ఆలయం భూమి కబ్జాకు గురికాగా కలెక్టర్ చొరవతో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీనికి స్థానికులు కలెక్టర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.