ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులతో డెంగ్యూ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 27,771 పరీక్షలు చేపట్టగా, 505 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మూడు వారాల్లో 62 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పరీక్షా కిట్లు, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామాల్లో, పాఠశాలల్లో, మార్కెట్లలో శుభ్రత పాటించాలని, అధికారులు విరివిగా టైపాయిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతి శుక్రవారం డ్రైడే లో పాల్గొనాలని సూచించారు.
సమీక్ష లో అడిషనల్ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్. బి. మాలతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.ఎస్. రాజేశ్వర రావు, జడ్పీసీఈఓ వీవీ అప్పారావు, విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పంచాయతీ అధికారి హరి కిషన్ పాల్గొన్నారు.