ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరగొద్దు: వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఖమ్మం జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్​లో ఖమ్మం నియోజకవర్గ స్థాయి సెక్టార్ ఆఫీసర్లకు, పీఓ, ఏపీఓల విధులపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీ ప్యాట్​లలో సమస్యలు తలెత్తితే వెంటనే సెక్టార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మాక్ పోల్ పూర్తయ్యాక తప్పనిసరిగా క్లియర్ చేయాలన్నారు. ఓటింగ్ తర్వాత క్లోజింగ్, మెషీన్లు, డాక్యుమెంట్ల సీలింగ్ పై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్లు శ్రీరామ్, మదన్ గోపాల్ పాల్గొన్నారు.