రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ ధరల నిర్ణయానికి చర్యలు : కలెక్టర్ వీపీ గౌతమ్

  •     ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ జలజ టౌన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. బుధవారం న్యూ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్​హాల్​లో ఖమ్మం రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం పోలేపల్లిలో గల జలజ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ) ముదాయాల   ఆస్తులను ధరలు నిర్ణయించడానికి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌, చైర్మన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 8 టవర్స్‌‌‌‌‌‌‌‌,  ఫ్లాట్స్‌‌‌‌‌‌‌‌,  ఖాళీస్థలం విలువను నిర్ధారణపై చర్చించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో  నగరపాలక సంస్థ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆదర్శ్‌‌‌‌‌‌‌‌ సురభి, రాజీవ్‌‌‌‌‌‌‌‌ స్వగృహ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ సీ.భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ శ్యాంప్రసాద్‌‌‌‌‌‌‌‌, జాయింట్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ రిజిష్ట్రార్‌‌‌‌‌‌‌‌ పద్మ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌‌‌‌‌‌‌‌ అధికారి జి.గణేశ్, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ మదన్‌‌‌‌‌‌‌‌గోపాల్‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.

ఎగ్జామ్ సెంటర్ తనిఖీ 

ఖమ్మంలోని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పీ  ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్​కు ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.