- రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపీవోల పాత్ర కీలకమని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పీవో, ఏపీవో, ఓపీవోలకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
పోలింగ్ రోజు ఉదయం 5.45 గంటలలోపు మాక్ పోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, ఏఎల్ఎంటీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ పూర్తి
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు వైరా అసెంబ్లీ సెగ్మెంట్ అడిషనల్ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ బుధవారం చేపట్టినట్లు గౌతమ్ తెలిపారు. బుధవారం న్యూ కలెక్టరేట్ ఆవరణలోని చేపట్టిన ఈవీఎం తనిఖీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు మూడు బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉన్నందున, అదనపు ఈవీఎంలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఈవీఎం గోడౌన్ లో ఉన్న వైరా అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 252 బ్యాలెట్ యూనిట్లు, 252 కంట్రోల్ యూనిట్లు, అదనంగా కేటాయించిన 2,200 బ్యాలెట్ యూనిట్ల ఫస్ట్ లెవల్ తనిఖీలు పూర్త చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.