సువిధ యాప్తో ఎన్నికల కార్యక్రమాలకు అనుమతులు : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  సువిధ యాప్ ద్వారా ఎన్నికల కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నట్టు   కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం   కలెక్టర్ ఛాంబర్ లో పలు పార్టీల లీడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సువిధ ద్వారా 424 అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.   కొత్త ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయి తనిఖీలు పూర్తిచేసి, రాజకీయ పార్టీల అభ్యంతరాలు ఉంటే స్వీకరించి, ఈ నెల 10 లోగా పరిష్కరిస్తామన్నారు.     ప్రతి పౌరుడూ ఓటు   హక్కు ను తప్పని సరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలకు గురికాకుండా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు వేసేలా చైతన్యం తేవాలని అధికారులకు సూచించారు.  ఎన్నికల అక్రమాల , ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులు సీ– విజిల్ యాప్ ద్వారా చేయాలన్నారు.