ఖమ్మం టౌన్, వెలుగు: అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరించినట్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మార్పులు చేర్పుల్లో భాగంగా 31458 ఫారం-6 దరఖాస్తులు, 20276 ఫారం-7 దరఖాస్తులు, 21294 ఫారం-8 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు చెప్పారు.