ఖమ్మం టౌన్, వెలుగు: జీఓ59ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మంగళవారం ఖమ్మంలోని 55వ డివిజన్ వేణుగోపాల్ నగర్, -1, 4వ డివిజన్ యూపీహెచ్ కాలనీ, వేణుగోపాల్ నగర్-2లో పర్యటించారు. జీఓ 59పై అవగాహన కల్పించారు.
స్థలాల క్రమబద్ధీకరణతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పట్టాలు ఇచ్చేందుకు కనీస ధర చెల్లిస్తే చాలన్నారు. 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్లోనూ పర్యటించారు. అనంతరం కలెక్టరేట్నుంచి వీడియో కాన్ఫరెన్స్నిర్వహించి అధికారులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల పురోగతి, బీసీ సంక్షేమ రుణాలు, నీటి సరఫరా, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరితహారం కార్యక్రమాలపై
సమీక్షించారు.