ఖమ్మం టౌన్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు. కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్ దత్ తో కలిసి శుక్రవారం రూరల్ మండలంలోని పొన్నెకల్ లో కౌంటింగ్ కేంద్రం కోసం ఎంపిక చేసిన శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించారు. కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.
భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎలక్షన్స్సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం కార్పొరరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.