కొత్త ఓటర్లు నమోదు చేయించుకోవాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  శని, ఆదివారాల్లో  నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శనివారం  నగరంలోని రోటరీనగర్  జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ప్రతీ పోలింగ్ కేంద్రాల్లో చేపడతామని తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి డ్రాఫ్ట్ ఫొటో ఓటర్ లిస్ట్, ఫారం 6, 7, 8తో అందుబాటులో ఉంటారని చెప్పారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం అర్బన్ తాహసీల్దార్ స్వామి, బీఎల్ఓలు పాల్గొన్నారు.