ఖమ్మం టౌన్, వెలుగు : ఈవీఎం గోడౌన్ పెండింగ్ పనులను స్పీడప్ చేసి వారంలోగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ. 2.78 కోట్లతో నిర్మిస్తున్న గౌడౌన్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓటు హక్కును వినియోగించునేలా చర్యలు అత్యవసర సర్వీస్‌ల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులకు సూచించారు.
మంగళవారం నూతన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో 13 రకాల అత్యవసర సేవల రంగాలకు చెందిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇందులో వైద్య, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్, తదితర శాఖలు ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.