భద్రాచలంలో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలంలో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక
  • భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ వరద

భద్రాచలం,వెలుగు : భద్రాచలం గోదావరి  మంగళవారం ఉదయం 6 గంటల కు మరోసారి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాదహెచ్చరిక  జారీ చేశారు. సోమవారం రాత్రి 8 గంటల కు  42.8 అడుగుల వద్ద ఈ ప్రమాద హెచ్చరికను  కలెక్టర్​ ఉపసంహరించారు. కాగా ఎగువన   కురిసిన భారీ వర్షాల కారణంగా తిరిగి వరద మొదలైంది.

మంగళవారం సాయంత్రం 43.50 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ప్రమాదం లేనట్లేనని ఆఫీసర్లు చెబుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద స్వల్పంగా వరద పెరుగుతుంది. ముంపు గ్రామాల్లో శానిటేషన్​పై పంచాయతీ సిబ్బంది ఫోకస్​ పెట్టారు. మెడికల్​ టీంలు ఫీవర్​ సర్వే నిర్వహిస్తున్నాయి.