- కరీంనగర్‌లో 206, సిరిసిల్లలో 20, జగిత్యాలలో 17 అర్జీలు
కరీంనగర్, వెలుగు: గ్రీవెన్స్‌కు రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రజావాణిలో తమ సమస్యలపై వస్తున్న బాధితులతో కలెక్టరేట్లు కిక్కిరిస్తున్నాయి. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 206 వినతులు వచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు 34, కొత్తపల్లి తహసీల్ఆఫీసుకు 16, కరీంనగర్ ఆర్డీవోకు 11, గంగాధర తహసీల్‌కు 9 ఫిర్యాదులు అందాయి. మిగిలిన శాఖలన్నింటికి కలిపి 136 ఫిర్యాదులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రీవెన్స్ సెల్ లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ ఆర్డీవో కె.మహేశ్వర్, బి.రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని శాతావాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్డాక్టర్పెంచాల శ్రీనివాస్కార్మికుల పక్షాన గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా పరిధిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరి సౌకర్యార్థం ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వినతిలో కోరారు.
- లోయర్ మానేరు డ్యాంలో ముంపునకు గురైన భూనిర్వాసితులకు తక్కువ పరిహారం చెల్లించడంతో చాలా నష్టపోయామని, ఇప్పటికైనా నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని లోయర్ మానేరు ముంపు గ్రామాల సంక్షేమ సంఘం సభ్యులు కలెక్టర్‌ను కోరారు. ఇప్పటిదాకా తమకు ఎలాంటి పునరావాసం, సహాయక చర్యలు చేపట్టలేదని వినతిలో పేర్కొన్నారు. పునరావాసంలో భాగంగా ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది అనర్హులే ఉన్నట్లు పేర్కొన్నారు.
గ్రీవెన్స్దరఖాస్తులకు పరిష్కారం చూపాలి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ------ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ పి. గౌతమి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి 20 వినతులు వచ్చినట్లు అడిషనల్కలెక్టర్తెలిపారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి కి వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17అర్జీలు పలు సమస్యలపై అర్జీలు ఇచ్చారన్నారు. వీటిల్లో భూ, ప్రభుత్వ, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు ఇచ్చినట్లు చెప్పారు.