దేశంలో అనేక విష‌‌‌‌యాల్లో మ‌‌‌‌నమే నంబ‌‌‌‌ర్ వ‌‌‌‌న్ :సీఎం కేసీఆర్​

జగిత్యాల, వెలుగు: తెలంగాణ ఏర్పడిన‌‌‌‌ప్పుడు రూ.62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే ప్రస్తుతం రూ.2 ల‌‌‌‌క్షల20 వేల కోట్లు దాటిపోనుంద‌‌‌‌ని, తెలంగాణ నైపుణ్యానికి కలెక్టరేట్​లే ప్రతీకలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జ‌‌‌‌గిత్యాలలో పర్యటించిన సీఎం నూతన కలెక్టరేట్ సముదాయంతోపాటు మెడికల్ కాలేజీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ లో సీఎం మాట్లాడారు. 

ఇది 14వ క‌‌‌‌లెక్టరేట్ 

కొత్త క‌‌‌‌లెక్టరేట్‌‌‌‌ బిల్డింగులలో జగిత్యాలది 14వ క‌‌‌‌లెక్టరేట్ అని, మిగ‌‌‌‌తావి త్వర‌‌‌‌లో ప్రారంభిస్తామని అన్నారు. పాలన న్యాయమార్గంలో జరగాలన్నారు. దేశంలో అనేక విష‌‌‌‌యాల్లో మ‌‌‌‌నమే నంబ‌‌‌‌ర్ వ‌‌‌‌న్ గా ఉన్నామన్నారు. ఇదంతా జరిగింది ఒక కేసీఆర్, సీఎస్, మంత్రుల‌‌‌‌తో కాదని మ‌‌‌‌నంద‌‌‌‌రి స‌‌‌‌మ‌‌‌‌ష్టి కృషి అని పేర్కొన్నారు.  

మూడుసార్లు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది

సీఎస్​సోమేశ్​కుమార్​మాట్లాడుతూ ఏడు సంవత్సరాల్లో మూడుసార్లు తెలంగాణ బడ్జెట్ పెరిగిందని అన్నారు. చాలా రాష్ట్రాల్లోని సెక్రటేరియట్ లు మన ఐడీఓసీలా కూడా లేవని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే అనేక పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుందని, ఇది మన ఉత్తమ పనితీరుకు నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవి ఉండడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టిందన్నారు.

సీఎంకు ఘన స్వాగతం..

జగిత్యాల కలెక్టరేట్​కు వచ్చిన సీఎంకు కలెక్టర్ రవి, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌ను ప్రారంభించిన కేసీఆర్​చాంబర్‌‌‌‌లోని సీట్లో కలెక్టర్‌‌‌‌ గుగులోతు రవిని కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మినిస్టర్లు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు  భాను ప్రసాద్ రావు, ఎల్.రమణ,  కౌశిక్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ వసంత, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

రూ. 510 కోట్లతో మెడికల్ కాలేజ్..

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.510 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నూతన వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామన్నారు. జిల్లాలోని థరూర్ క్యాంపులో 8.6 ఎకరాలలో శాశ్వత వైద్య కళాశాల భవనం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, కాలేజీ సిబ్బంది క్వార్టర్స్, అతిథి గృహం  నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను 119.85 కోట్లకు ప్రభుత్వం పూర్తి చేయగా సీఎం శంకుస్థాపన చేశారు.