నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : న్యూ ఇయర్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జితేశ్వి పాటిల్ ఆకాంక్షించారు. ఆదివారం రెండు కలెక్టరేట్ల ఆయా శాఖ ల ఆఫీసర్లు న్యూఇయర్సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి కేక్ కట్ చేశారు. నిజామాబాద్ సీపీ కె.ఆర్‌నాగరాజు, అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా ఇతర ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల, వివిధ సంఘాల లీడర్లు, ఉద్యోగ సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్ తదితరులు ఉన్నారు.
స్టూడెంట్లకు దుప్పట్లు, నోట్ బుక్కులు
న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి హాస్టల్స్టూడెంట్లకు పంపించారు. పూల బొకేలకు బదులుగా పేద స్టూడెంట్లకు బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన వచ్చింది. కలెక్టర్‌కు విషెస్చెప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ దుప్పట్లు, నోట్ బుక్స్ తీసుకురాగా, కలెక్టర్ వాటిని స్టూడెంట్లకు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు అందజేశారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి కలెక్టరేట్లోనూ న్యూ ఇయర్ వేడుక లు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జితేశ్వి పాటిల్‌ను ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్దొత్రే, చంద్రమోహన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా శాఖల జిల్లా ఆఫీసర్లు, టీజీవో, టీఎన్జీవో సంఘం ప్రతినిధులు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు, ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్యను కలిసి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు విషెస్ చెప్పారు.