ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లు​హనుమంతరావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. 

సోమవారం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్ల​లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను వారు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధింత డిపార్ట్​మెంట్లకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు.  యాదాద్రి జిల్లా నుంచి మొత్తం 58 ఫిర్యాదులు రాగా వాటిలో భూములకు సంబంధించి 34 ఉన్నాయని తెలిపారు.  

నల్గొండ నుంచి 120 దరఖాస్తులు..

నల్గొండ కల్లెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 120 దరఖాస్తులు  వచ్చాయి. స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. 

సూర్యాపేట నుంచి 62 దరఖాస్తులు..

సూర్యాపేట కలెక్టరేట్​లో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు  స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు34 దరఖాస్తులు వచ్చాయి. డీఆర్డీఏకు 5 దరఖాస్తులు, ఇరిగేషన్ 5, వ్యవసాయశాఖ 3, మున్సిపాలిటీ 3, మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 

మరోవైపు జిల్లా పోలీస్  కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.