గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్లు

గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్లు

మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ములుగు, వెలుగు: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అన్నారు. సోమవారం మహబూబాబాద్​కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్ తె కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 46 అర్జీలను స్వీకరించారు. 

ములుగులో కలెక్టర్​దివాకర అడిషనల్​కలెక్టర్​ఇన్​చార్జి  సంపత్ రావు, ఆర్డీవో సత్య పాల్ రెడ్డితో కలిసి 11 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో మొత్తం 17 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్​రోహిత్​సింగ్ తెలిపారు. అనంతరం ఆయా అర్జీలలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.