
ఆసిఫాబాద్/నిర్మల్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ధోత్రే దరఖాస్తులు స్వీకరించారు. తమకు ఎన్ టీఆర్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించాలని తిర్యాణి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరారు.
పట్టా భూమికి కొలతలు చేపట్టి హద్దులు నిర్ధారించాలని, నిషేధిత జాబితా నుంచి పట్టాభూమి తొలగించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని వచ్చిన ధరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. శాఖల వారీగా విభజించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 90 దరఖాస్తులు
ఆదిలాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 90 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆ దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.