టీమ్స్​యాక్టివ్​గా ఉండాలి : కలెక్టర్లు రాజీవ్ ​గాంధీ, జితేశ్​ పాటిల్​

  •    కలెక్టర్లు రాజీవ్ ​గాంధీ, జితేశ్​ పాటిల్​

నిజామాబాద్, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిఘా టీమ్​లు మరింత అలర్ట్​గా ఉండాలని నిజామాబాద్​ కలెక్టర్ ​రాజీవ్ ​గాంధీ హన్మంతు, కామారెడ్డి కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ఆదేశించారు. శనివారం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో నోడల్​ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశాల్లో వారుమాట్లాడారు. నిజామాబాద్​లో కలెక్టర్​ రాజీవ్ ​గాంధీ మాట్లాడుతూ.. అధునాతన ఎఫ్ఎస్​టీ, ఎస్ఎస్​టీ టీమ్​ వెహికల్స్​కు పీటీజెడ్​కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్​ రూమ్ ​ద్వారా మానిటరింగ్​ చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ​నుంచి పరిశీలకులుగా వచ్చిన ఆఫీసర్లకు పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా జిల్లాలో ఎన్నికల సన్నద్ధత గురించి వివరిచారు. రూ.కోటి.85 వేల మద్యం, రూ.3.82 కోట్ల నగదు, రూ.78 లక్షల విలువ బంగారాన్ని పట్టుకున్నామన్నారు.

గ్రీవెన్స్​సెల్ ​పరిశీలనతో వాస్తవాలు తెలుసుకొని నగదు వాపస్ ​ఇస్తున్నామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చును లెక్కించే కమిటీలు నివేదికలు అందిస్తున్నాయన్నారు. పక్క రాష్ట్ర పోలీసులతో కోఆర్డినేషన్​ ఓటింగ్​ ప్రక్రియ సజావుగా ముగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ కల్మేశ్వర్​ సింగన్​ వార్ ​తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ ​పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నామన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్ల  నియమాకం కోసం శనివారం ర్యాండమైజేషన్ ​ప్రక్రియను చేపట్టారు. కలెక్టరేట్​లో ఎన్నికల జనరల్​అబ్జర్వర్లు చిఫంగ్​అర్థుర్​పర్చూయియో, జగదీశ్, కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ సమక్షంలో ర్యాండమైజేషన్​ చేశారు. పోలింగ్​కేంద్రాల్లో పర్యవేక్షణ కోసం 126 మంది మైక్రో అబ్జర్వర్లు అవసరముండగా 29 శాతం అధికంగా 164 మందిని సెలక్ట్​ చేసినట్లు కలెక్టర్​ తెలిపారు.  సీనియర్​ ఐఏఎస్​అధికారులు గౌతమ్​సింగ్, సుబ్రా చక్రవర్తి, లలిత్​ 
నారాయణ్​సింగ్ పాల్గొన్నారు.