వరదలపై అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిన ఆఫీసర్లు

వరదలపై అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిన ఆఫీసర్లు
  • ముందస్తు జాగ్రత్తలపై జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్ల రివ్యూ
  • రెండేళ్లుగా భారీ వర్షాలతో గోదావరి తీరం అతలాకుతలం
  • పల్లెలను ముంచెత్తిన వరదలు, భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం
  • ఈ ఏడాది కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ఈ ఏడాది జూలై నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి తీర ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వరదలు వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్లు జిల్లాస్థాయి ఆఫీసర్లతో రివ్యూలు నిర్వహించారు. అలాగే గతంలో నీట మునిగిన గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాలు, మోరంచవాగు, జంపన్నవాగు తీరాన ఉన్న గ్రామాల్లో కలెక్టర్లు పర్యటిస్తున్నారు. వరదలు వస్తే ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయిలో వరద సహాయక చర్యల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

వరద సహాయక చర్యల కమిటీల ఏర్పాటు

భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు 24 గంటలు పనిచేసేలా జిల్లా స్థాయిలో కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. గ్రామ, మండల, జిల్లాస్థాయి ఆఫీసర్లు తాము పనిచేసే చోటే అందుబాటులో ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో వరద సహాయక చర్యల కమిటీలను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో మొబైల్ టీంను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా వరదల బారి నుంచి ప్రజలను రక్షించాలని చెప్పారు.

గ్రామ స్థాయిలో  పంచాయతీ సెక్రటరీలు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్లు, యువతను సమన్వయపరుస్తూ గ్రామాల్లో వరద ఉధృతికి కారణమయ్యే ప్రాంతాలు గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, వంగిన పోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించి తొలగించాలని చెప్పారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చెరువులపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చెరువులు తెగడం వల్లే భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నందున ఈ సారి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగు జిల్లాల్లో కలిపి 10 వేలకు పైగా మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువులు ఉన్నాయి. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెరువు కట్టలను పరిశీలించి తెగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటల మత్తడుల వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పారు. ప్రతి చెరువు దగ్గర సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులు ఏర్పాటు చేయాలని, నీటి స్టోరేజీ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. వరదల వచ్చిన టైంలో జాలర్లు, మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు.

అప్రమత్తమైన పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ

వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పోలీసులదే ప్రధాన పాత్ర. ఈ నేపథ్యంలో రాబోయే వరదలను తట్టుకోవడానికి వీలుగా నాలుగు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు 20 మందికి పైగా సుశిక్షితులైన సిబ్బందిని నియమించారు. అత్యవసర సమయంలో ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తామని ఆయా జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు. రోడ్ల పైకి వరద నీరు చేరిన మార్గాల్లోనూ, పొంగుతున్న వాగులు దాటకుండా పటిష్ఠ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తామని, రహదారులపై రవాణా నియంత్రణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని, వరదలు సంభవించినప్పుడు ట్రాక్టర్లు, జేసీబీలను సైతం వినియోగిస్తామని ఎస్పీలు ప్రకటించారు.

కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటన

భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కొత్తగా నియామకమైన కలెక్టర్లు విధుల్లో చేరిన వెంటనే గోదావరి వరదలపై సమీక్షలు జరిపారు. గతేడాది వరదల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందిన కొండాయి గ్రామాన్ని ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దివాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శించారు. ప్రజలతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఈ సారి వరదలు వచ్చినా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూపాలపల్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శర్మ గత రెండేళ్లుగా జిల్లాలో వరదల వల్ల కలిగిన నష్టంపై అన్నీ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నీటి పారుదల, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

2022 జూలై రెండో వారంలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి తీరం ఉప్పొంగింది. ఒకేసారి 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా కట్టిన కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నీట మునిగి మోటార్లు పాడయ్యాయి. అలాగే భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలలోని వందలాది గ్రామాలు నీట మునగడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పలిమెల మండలాల్లోని ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అడవిలో తలదాచుకున్నారు. 50 వేల ఎకరాలకు పైగా పంట భూములు కొట్టుకుపోయాయి.

2023 జూలై మూడో వారంలో కురిసిన వర్షాలకు భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని వాగులు పొంగి పొర్లాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు 60 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు కావడంతో మోరంచపల్లి, కొండాయి గ్రామాలు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 22 మందికి పైగా వరదల్లో చిక్కుకొని చనిపోయారు. ఇంకా మూడు మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. 300లకు పైగా చెరువుల కట్టలు తెగిపోయాయి. వందలాది కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 60 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేశాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారారు.