నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని ప్రతి పోలింగ్సెంటర్ను పొలిటికల్పార్టీల లీడర్లు విజిట్‌చేసి లోపాలు కనిపిస్తే తెలియజేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. బుధవారం ఆయన లీడర్లతో మీటింగ్నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్సెంటర్ల ఫైనల్వివరాలు ఎలక్షన్ కమిషన్‌కు పంపనున్నామని అంతకు ముందే లోపాలు తెలపాలన్నారు. కొత్త కేంద్రాలు అవసరమైనా, ఉన్న కేంద్రాన్ని మరో చోటకు షిఫ్టు చేయాలన్నా ఇప్పుడే చెప్పాలన్నారు.
పాత శిథిల భవనాల్లో ఉన్న కేంద్రాల వివరాలు, ఓటరు లిస్టు పేర్లను పరిశీలించాలని కోరారు. ఈఆర్‌వోల ద్వారా ప్రతిపాదనలు పంపాలన్నారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, నగర పాలక కమిషనర్ మంద మకరంద్, ఆర్డీవోలు రాజేశ్వర్, వినోద్‌కుమార్, రవికుమార్, తహసీల్దార్లు ఉన్నారు.