సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ, సూర్యాపేట కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 79 ఫిర్యాదులు రాగా, నల్గొండ జిల్లా నుంచి 50 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్లు ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. 

సీఎం కప్​ పోటీలు ప్రారంభం

యాదాద్రి, నల్గొండ అర్బన్ : సీఎం కప్​ పోటీలు జిల్లాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం కప్​ జెండాను ఆవిష్కరించి పోటీలను యాదాద్రి, నల్గొండ కలెక్టర్లు హనుమంతరావు, ఇలా త్రిపాఠి​ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈనెల 7 నుంచి గ్రామీణ, మండలాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపినవారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వీరికి ఈనెల 20 వరకు వివిధ ఆటల్లో పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం 21న ఫైనల్ పోటీలు జరుగనున్నాయి.