
పాపన్నపేట, వెలుగు: ఈ నెల 8 నుంచి జరిగే ఏడుపాయల మహాజాతరను సక్సెస్ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్సూచించారు. శనివారం జాతర ఏర్పాట్లపై అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుపాయల జాతర పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. షవర్లు, తాగునీటి నల్లాలు, బాత్రూమ్స్ అన్ని వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.
అడిషనల్కలెక్టర్రమేశ్ మాట్లాడుతూ.. ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని, భక్తులతో సిబ్బంది ఎక్కడ దురుసుగా ప్రవర్తించరాదని సూచించారు. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకుండా చూసుకోవాలన్నారు. వీవీఐపీ దర్శనాల్లో ఆలయ మర్యాదలను పాటించాలని ఆలయ ఈవోను ఆదేశించారు. డీఎస్పీ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఏడుపాయల జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీవో రమాదేవి, ఈవో మోహన్ రెడ్డి , ఆలయ చైర్మన్ బాల గౌడ్ , తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర, డీపీవో యాదయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఏడీ మైన్స్ జయరాజ్, మత్స్యశాఖ అధికారి నరసింహారావు, ఇండస్ట్రీస్ జీఎం కృష్ణమూర్తి, ఈఈపీఆర్నరసింహులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, రెవెన్యూ, పోలీస్ ఎక్సైజ్, లీగల్ మెట్రాలజీ, ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.
ఝరాసంగం, కొప్పోల్‌కు
మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ నుంచి ఝరాసంఘంకు 6, పెద్దశంకరంపేట మండలం కొప్పోల్‌కు 4 బస్సులు నడుపుతామని తెలిపారు. అలాగే సిద్దిపేట నుంచి వేములవాడకు రెగ్యులర్ సర్వీస్‌లతోపాటు, అదనంగా 3 బస్సులు నడుపుతామని చెప్పారు. జాతర స్పెషల్ బస్సులకు సాధారణ చార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు.
ఏడుపాయల జాతరకు 167 స్పెషల్ బస్సులు
మెదక్: ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి 167 స్పెషల్ బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ మెదక్ రీజినల్‌మేనేజర్ ప్రభులత తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. జూబ్లీ బస్‌స్టేషన్, బాలానగర్ నుంచి 33, మెదక్ నుంచి 11, సంగారెడ్డి నుంచి 19, జహీరాబాద్ నుంచి 18, సదాశివపేట నుంచి 13, హైదరాబాద్‌నుంచి 12, పెద్దశంకరంపేట నుంచి 8, బొడ్మట్‌పల్లి నుంచి 8, నర్సాపూర్ నుంచి 7, జోగిపేట నుంచి 7, సిద్దిపేట నుంచి 3, గజ్వేల్, ప్రజ్నాపూర్ నుంచి 2, టేకుల గడ్డ నుంచి ఆలయం వరకు 10 స్పెషల్ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.