
2023-–2024 విద్యా సంవత్సరానికి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు.
అర్హత : ఇంటర్మీడియట్‌తో పాటు జీఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణులైన మహిళలు దరఖాస్తుకు అర్హులు. వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
సెలెక్షన్ : ఇంటర్, జీఎన్‌ఎం విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2,500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000) చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.