ఇంటర్​ విద్యార్థి కుటుంబానికి రూ. 30 లక్షలు?

ఇంటర్​ విద్యార్థి కుటుంబానికి రూ. 30 లక్షలు?

ఘట్​కేసర్, వెలుగు: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని ఓ కార్పొరేట్​ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి యాజమాన్యం రూ.30 లక్షల నష్టపరిహారం ఇచ్చినట్టు తెలిసింది. సోమవారం ఇంటర్ విద్యార్థి బానోత్ తనుష్ నాయక్ ఉరి వేసుకోగా కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల లీడర్లు ధర్నా చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి పై దాడి చేశారు. 

దీంతో యాజమాన్యం మృతుడి తల్లిదండ్రులు, బంధువులతో చర్చలు జరిపి రూ.30 లక్షలు చెల్లించేందుకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఆందోళనతో ఉద్రిక్తతలు నెలకొనడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులకు మేనేజ్​మెంట్​ఫోన్​చేసింది. పేరెంట్స్ వచ్చి 600 మంది పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లిపోయారు. విద్యార్థి సంఘాలు వచ్చి ఆందోళన చేస్తాయని తెలిసి మంగళవారం కాలేజీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.