కోల్ కతా: దేశవ్యాప్తంగా కలకలం రేపిన వైద్యవిద్యార్థిని కేసును ప్రస్తావిస్తూ... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ డిగ్రీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితుడు బీకాం సెకండియర్ చదువుతున్న కీర్తిశర్మగా పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థి బెదిరింపు పోస్టు.. రెచ్చగొట్టేదిగా, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేదిలా ఉందని తెలిపారు. ఈ నెల 9న కోల్ కతాలోని ఓ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి పేరు, ఫొటోను బయటపెట్టాడని పోలీసులు తెలిపారు.
సీఎంపై హత్యాయత్నానికి కుట్ర, అల్లర్లకు రెచ్చగొట్టడం, లైంగికదాడి బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాలతో నిందితుడిపై కేసులు నమోదు చేశారు.