ఆక్రమణ లెక్క తేలాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు

ఆక్రమణ లెక్క తేలాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు

హైదరాబాద్ సిటీ శివార్లలోని దుండిగల్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 2024, ఆగస్ట్ 28వ తేదీ ఈ మేరకు సమాచారం ఇచ్చారు అధికారులు. 

దుండిగల్ పరిధిలో ఉన్న చిన్నదామెర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం జరిగిందని.. దీనికి సంబంధించి మీ వివరణ ఏంటీ అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు. 
చిన్నదామెర చెరువునకు చెందిన 8 ఎకరాల 24 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. సర్వే నెంబర్లు 489, 485, 458, 484, 492, 489 భూముల్లో భవనాలు, షెడ్స్, వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని.. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. 7 రోజుల్లో కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు.

Also Read:-డిసెంబర్ 9న పండగ రోజు

ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. 

హైకోర్టులో దాఖలైన పిటిషన్ లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలోని 13 చెరువుల ఆక్రమణలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతోనే రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.