చైనా బార్డర్ లో చనిపోయిన కల్నల్ తెలంగాణ వ్యక్తే

చైనా బార్డర్ లో చనిపోయిన కల్నల్ తెలంగాణ వ్యక్తే

ఈ రోజు భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఒక కల్నల్ తో పాటు మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. గాల్వాన్ వ్యాలీలో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చనిపోయిన కల్నల్ ను సంతోష్ గా గుర్తించారు. సంతోష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యపేట జిల్లాకు చెందినవాడు. సంతోష్ బీహార్ 16వ బెటాలియన్ లో కల్నల్ ర్యాంకులో పనిచేస్తున్నాడు. సంతోష్ కు మూడు నెలల క్రితమే హైదరాబాద్ కు బదిలీ అయింది. అయితే లాక్డౌన్ కారణంగా సంతోష్ అక్కడే విధులలో ఉన్నాడు. కల్నల్ సంతోష్ 1993 నుంచి 2000 సంవత్సరం వరకు కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదువుకున్నారు.

కల్నల్ మృతి గురించి అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

For More News..

దొంగల ముఠాను పట్టించిన చిన్న క్లూ

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్

బాయ్ ఫ్రెండ్ తో గొడవ.. 30 వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ అద్దం పగులగొట్టిన యువతి