- గీతం ఎన్‌సీసీ యూనిట్ పరిశీలనలో కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని, దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు ముందుండాలని నిజామాబాద్‌లోని 33 బెటాలియన్ కమాండర్ కల్నల్సునీల్ అబ్రహం అన్నారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్శిటీ ఎన్‌సీసీ యూనిట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలు చేరుకోవడానికి శిక్షణ ఎంతో ప్రాముఖ్యమైందని వివరించారు.
ఎన్‌సీసీ సామాజిక సేవతోనే ఆగిపోదని సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాల్లో ఎన్‌సీసీ విద్యార్ధులకు 30 శాతం వెయిటేజీ లభిస్తుందని, మహారాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల్లో 5 శాతం అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ క్యాంపులకు ఎన్నికైన గీతం ఎన్‌సీసీ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్రమేశ్సిరియాల్, అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్కల్నల్మధుసూధన రావు, గీతం వీసీ ప్రొఫెసర్డీఎస్రావు, రెసిడెంట్ డైరెక్టర్డీవీవీఎస్ఆర్ వర్మ, ఎన్‌సీసీ ఆఫీసర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.