వికారాబాద్ జిల్లా: కొడంగల్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాలాజీ నగర్, కుమ్మరివాడ సహా పలు కాలనీల్లో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలను ముంచెత్తిన వరద ఇళ్లలోకి కూడా చేరుతోంది. వరద ప్రభావిత ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు.