కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ (మాల) సామాజికవర్గంలోని దళితవాడలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, శ్మశానం చుట్టూ ప్రహారీ నిర్మాణం కావాలని శనివారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి కాలనీవాసులు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ మీకున్న సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ చెన్నా మోహన్ రావుకి ఫోన్ చేసి శ్మశాన వాటిక కు వెళ్లే దారిలో సీసీ రోడ్డు వేయాలని ఆదేశించారు.