కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లో పట్టణంలోని 29వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియాలో నాలా ఆక్రమణకు గురైందని కాలనీ వాసులు నిరసనకు దిగారు. వీఐపీ స్కూల్ సమీపంలో నాలా కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరసనగా నాలా కబ్జాకు గురైన చోట ఫ్లెక్సీ కట్టి అక్కడే టెంట్ వేసుకొని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికా రులు అక్కడకు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి సముదాయించారు.