డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతూ కాలనీవాసులు ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. ఇండ్లు ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే  విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సూచించారు. 

కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది

జగిత్యాల, వెలుగు : గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 19 వ వార్డులో నిర్వహించిన  ప్రజా పాలన వార్డు సభలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని, లిస్టులో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట పీసీసీ సెక్రెటరీ బండ శంకర్, రూరల్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్ ఉన్నారు.